- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెలకు దూరంగా ఆర్టీసీ సేవలు…కరోనా నుండి అరకొర సర్వీసులు
దిశ, యాచారం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో మాదిరి ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సు సర్వీసులను తగ్గించడంతో మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా రాక మునుపు కందుకూరు యాచారం, రూటులో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డిపోల బస్సులు అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రయాణాలు సాగించేవారు. నేడు ఉదయం సాయంత్రం ఒకే బస్సు మాత్రమే అందుబాటులో ఉంది తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
అదే అదునుగా ప్రైవేటు వాహనదారులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. చౌదర్ పల్లి, మేడిపల్లి, చింతపట్ల, మొండి గౌరెల్లి, కొత్తపల్లి, తక్కలపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, గ్రామాలకు బస్సులను పూర్తిగా తగ్గించి నాగార్జునసాగర్ మెయిన్ రోడ్డు మాల్, హైదరాబాద్, రూట్లో మాత్రమే తిప్పుతున్నారు. ఉదయం వేళల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు కోరుతున్నారు.