- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మైనింగ్ ఏర్పాటు చేయొద్దని ఎమ్మెల్యేకి వినతి
దిశ, యాచారం : మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 19లో కొండెంగల గుట్టలో మైనింగ్ క్వారీని చేపట్టేందుకు లీజు హోల్డర్లు ప్రొక్లెయిన్ పెట్టడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. అయితే బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తాండ్ర రవీందర్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే అప్పట్లో అధికారులు లీజు హోల్డర్లకు అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. మొండిగౌరెల్లిలో కంకర మిషన్ ఏర్పాటు చేయవద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కోరామన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష , బీజేపీ నాయకులు పత్తి రాజు , పల్లపు నరేష్, సంగం శ్రీనాథ్, బన్నె శివ, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.