ఆఫీస్ మెట్ల పై రేషన్ కార్డు దరఖాస్తు దారులు..

by Sumithra |   ( Updated:2025-01-21 14:54:55.0  )
ఆఫీస్ మెట్ల పై రేషన్ కార్డు దరఖాస్తు దారులు..
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ పెద్ద అంబర్పేటలో నీరుగారుతోంది. సరైన విధంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం అవడంతో ఈరోజు ఎక్కడ దరఖాస్తు స్వీకరణ ఉంటుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. టీవీలలో పత్రికలలో సమాచారాన్ని తెలుసుకున్న ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కొంతమంది అక్కడే దరఖాస్తులు ఫారాలు తీసుకుని అక్కడే కింద కూర్చొని నింపేస్తున్నారు.

మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన దారి వద్దనే మెట్ల పై కూర్చున్న ఇద్దరు మహిళల పరిస్థితిని అధికారులు చూసి కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు కనీస సౌకర్యాలు అయిన నీళ్లు, కుర్చీలు లేక ఈ విధంగా ఆఫీస్ మెట్ల పైనే కూర్చొని దరఖాస్తు నింపుతుండడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజలకు కావాల్సిన సమాచారం చేరవేస్తూ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed