భూ క్రమబద్దీకరణకు గడువు పొడగింపు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హరీష్​

by Javid Pasha |
భూ క్రమబద్దీకరణకు గడువు పొడగింపు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హరీష్​
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూ క్రమబద్దీకరణకు దరఖాస్తు స్వీకరణ గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడగించినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హరీష్​ ఒక ప్రకటనలో తెలిపారు. 58, 59 జీవో ప్రకారం ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పాటు చేసుకున్నపేద, మధ్య తరగతి కుటుంబాలకు నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించనున్నట్లు పేర్కొన్నారు. తొలుత 2019, 2020 జూన్​ 2 వరకు చివరి తేదీగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిందని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈనెల​ 30వ తేదీ వరకు మీసేవ ద్వారా ఆన్​లైన్​ దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

Advertisement

Next Story