- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దైవ చింతనతోనే సమాజంలో శాంతి సాధ్యం…: కల్వకుర్తి ఎమ్మెల్యే
దిశ,మాడ్గుల : దైవ చింతనతోనే సమాజంలో శాంతి సాధ్యమని అందుకోసం ప్రతి ఒక్కరు దైవచింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మాడ్గుల మండలం సుద్ధపల్లి గ్రామం లో గణపతి , జ్ఞాన సరస్వతి,అభయాంజనేయ స్వామి, ధ్వజస్తంభం పున: ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో భక్తి భావంతోనే శాంతి నెలకొంటుందని తెలిపారు.
దేవాలయ అభివృద్ధికి మూడు లక్షలు మంజూరు చేయడంతో పాటు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గ్యార నరసింహ, నాయకులు దేవరకొండ శ్రీనివాస్, ఎస్ఎంసీ డైరెక్టర్లు పల్లె జంగయ్య గౌడ్, రమేష్ గౌడ్, రేవంత్ మిత్ర మండలి అధ్యక్షుడు భాస్కర్,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.