గత పాలకులు వ్యవసాయం దండగా అన్నారు: ఎమ్మెల్యే జైాపాల్ యాదవ్

by Kalyani |
గత పాలకులు వ్యవసాయం దండగా అన్నారు: ఎమ్మెల్యే జైాపాల్ యాదవ్
X

దిశ, తలకొండపల్లి: గతంలో వ్యవసాయం దండగా అన్న పాలకులు నేడు రైతాంగం కోసం అది చేస్తాం ఇది చేస్తామని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు. మండలంలోని తలకొండపల్లి, రాంపూర్, గట్టు ఇప్పలపల్లి రైతు వేదికలలో నిర్వహించిన రైతు సంబరాలకు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా పడకల్, వెల్జాల్, చుక్కాపూర్ గ్రామాల్లో కూడా రైతు వేదికల వద్ద రైతు సంబరాలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి రైతు వేదిక వరకు భారీ ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ఎమ్మెల్యే జైపాల్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే ఆయా రైతు వేదికల్లో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని రైతులకు అన్ని రంగాలలో ఆదుకొని పెద్దపీట వేయడంతో నేడు దేశంలోనే తెలంగాణ పంటల దిగుబడిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల రైతు సమన్వయ సంఘ అధ్యక్షులు పద్మ నరసింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, తహసీల్దార్ కృష్ణ, వ్యవసాయ అధికారి రాజు, ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఏఈవోలు, గ్రామ రైతు సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed