దాతలు నిర్మించిన అధికారులు కనికరించరు..

by Aamani |
దాతలు నిర్మించిన అధికారులు కనికరించరు..
X

దిశ,తలకొండపల్లి : ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్న అక్కడక్కడ పేద ప్రజల అవసరాలకు మాత్రం పూర్తిస్థాయిలో అందడం లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసిన సుమారు 15 నుండి 20 సంవత్సరాల క్రితం ఆమనగల్ లైన్స్ క్లబ్ లేదా స్వచ్ఛంద సంస్థల దాతలు కొంతమంది బస్ షెల్టరను 50 శాతం మేర నిర్మించారు. గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా రోడ్డు పక్కనే బస్సు స్టేజి వద్దె అందరికీ అనువుగా ఉండే విధంగా లక్షల రూపాయల ఖర్చు పెట్టి బస్సు హెల్టర్లను వర్షాకాలంలో వర్షానికి, ఎండాకాలంలో ఎండకు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని గతంలోనే నిర్మాణాలు సైతం చేపట్టారు.

కానీ తలకొండపల్లి మండలంలోని ఆమనగల్ నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న సంగాయిపల్లి గేటు సమీపంలో సుమారు 15 సంవత్సరాల క్రితం లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుమారు 1.50 వేల రూపాయలతో నిర్మించారు. అతివృష్టి అనావృష్టి సంభవించినప్పుడు బాటసారులకు, బస్సు వచ్చే వరకు కనీసం ఆ షెల్టర్లో 20 మంది వరకు సేద దీరే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ బస్సు షెల్టర్ ఉన్నా కూడా వర్షం వస్తున్న సమయంలో లోనికి వెళ్లి కనీసం తల దాచుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా పిచ్చి మొక్కలతో చెత్తాచెదారంతో నిండుక పోయింది. ప్రతినిత్యం ఆ షెల్టర్ పక్కనుండే అధికారులు వెళ్తున్న వారికి కనిపించడం లేదా అని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా ఆ బస్సు షెల్టర్ పక్కనే సంగాయిపల్లి తండా కు వెళ్లే దారిని తెలపడానికి సూచిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు, ఆ బోర్డు కూడా చెట్ల పొదలతో కమ్ముకపోయింది. ఒకపక్క జిల్లా ఉన్నత అధికారులతో పాటు, కలెక్టర్ గ్రామాలను, పరిసర ప్రాంతాలను రోడ్లను ప్రజలు ఎక్కువగా తిరిగే చోట పరిశుభ్రంగా ఉంచుకోవాలని పదేపదే చెబుతున్న కింది స్థాయి అధికారులకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికైనా స్థానిక ప్రభుత్వ అధికారులు వెంటనే చెత్తా చెదారంతో నిండకపోయినా బస్సు షెల్టర్ ను శుభ్రం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని తండావాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed