కేసీఆర్, మోడీ తోడు దొంగలంటూ NSUI ప్రచారం

by srinivas |
కేసీఆర్, మోడీ తోడు దొంగలంటూ NSUI ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరు దోచుకునే తోడు దొంగలేనని ఎన్ఎస్‌యూఐ ప్రచారం చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాల్ నగర్ వద్ద ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ర్యాలీగా నిర్వహించారు. ఒకే నాణేంపై నరేంద్ర మోడీ, కేసీఆర్ ముద్రించి ఇద్దరూ ఒకటేనని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒకవైపు కేసీఆర్, మరోవైపు నరేంద్ర మోడీ వీరిద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇద్దరూ పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని బల్మూరి వెంకట్ తెలిపారు.

Advertisement

Next Story