- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం..
దిశ, చేవెళ్ల: రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య విమర్శించారు. బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చేవెళ్లలో కేజీయర్ పంక్షన్ హల్‌లో సోమవారం వారు మాట్లాడుతూ.. దేశంలో 21 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న.. తెలంగాణ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఐదు శాతమైన ఉన్నాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే 2022లో మే లో టెండర్ ఫైనల్ అయిందని హైవే 60 మీటర్స్ వెడల్పుతో సెప్టెంబర్ 28 పైనల్ అయినదన్నారు. హైవే భూసేకరణ పనులు 76 నుంచి 77శాంతం పూర్తయిందన్నారు. మొత్తం కేంద్రం హైవేకి ఇచ్చింది 39 వేల కోట్లు అన్నారు.
ముస్లిం రిజర్వేషన్ కేంద్రంకు పంపినా పెడచెవిన పెట్టారన్నారు. అన్నదమ్ముల కలిసి ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టుడే బీజేపీ పని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి చేవెళ్ల కు వచ్చి ఏం హామీ ఇచ్చారని వారు ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం, బాధాకరమైనదన్నారు. 13సార్లు గుజరాత్ పేపర్ లీక్ అయితే ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయలేరని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ చూస్తే తెలుస్తుంది. రాష్టంలో లా అండ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా అమలు చేస్తున్నామో అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వలేదన్నారు. రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. బండి సంజయ్ కోసమే సభ పెట్టారన్నారు. రాష్ట్రంపై బీజేపీ విషయం కక్కుతున్నరన్నారు. దేశంలోనే శాంతి భద్రతలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్రం పైసా ఇవ్వకపోయినా 79 శాతం పూర్తి అయినదన్నారు.
ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డి మాట్లాడుతూ..
కొత్త సీసాలో పాత సారా లేక బీజేపీ విద్వేషపూరితంగానే మాట్లాడుతుందని అన్నారు. సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు ఏమీ హామీ ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఓర్వలేక రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ పార్టీని నమ్మేస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని మరోసారి రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు పెద్దల ప్రభాకర్, రవీందర్ రెడ్డి, బి నర్సింలు, ఫాయాజిద్దిన్,శేఖర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.