- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుల్తాన్ పల్లి భూమికి.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఎలాంటి సంబంధం లేదు..
దిశ, శంషాబాద్ : సుల్తాన్ పల్లి భూమికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఎలాంటి సంబంధం లేదని శంషాబాద్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దండు ఇస్తారి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 129, 142లో గల 25.10 గుంటల భూమికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఎలాంటి సంబంధం లేదని సుల్తాన్ పల్లి సర్పంచ్ దండు ఇస్తారు స్పష్టం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 25 ఎకరాల 10 గుంటల భూమినీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేశారని తెలిపారు.
సర్వేనెంబర్ 142లో 84 మంది నిరుపేద ప్రజలకు ఇండ్లపట్టాలు ఇచ్చారని నిరుపేదలకు న్యాయం జరగాలని కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ స్థలం వివాదంలో కోర్టు తీర్పు ఏ విధంగా వస్తే దానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కానీ బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాజకీయ లబ్ధికోసం తమ గ్రామానికి సంబంధించిన విషయాన్ని వాడుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరువును దిగదర్చడం సరికాదని, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వరుసగా మూడుసార్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ గెలుపొందారని ఆయన రాజకీయ ఎదుగుదలను ఎదుర్కొనలేక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలప్పుడే రాజకీయాల గుర్తొస్తాయి తప్ప ప్రజల అవసరాలు ఏనాడు పట్టించుకోలేదని అందుకే మూడుసార్లు పోటీ చేసిన ఎన్నికలలో ఓడించి ప్రజల గుణపాఠం చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కృష్ణ, చంద్రశేఖర్, అరుంధ వీరేశం, మాజీ ఉపసర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్, ప్రభాకర్ గౌడ్, రమేష్, పాండు రంగారెడ్డి, బలవంత రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కావలి ఈశ్వరయ్య, దేవేందర్, సిద్ధిక్, శివ, రాజేందర్ గౌడ్, మైలారం రాజు, ఏం అశోక్, సిద్దు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.