ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే "బస్తీబాట".. షాద్ నగర్ ఎమ్మెల్యే

by Sumithra |
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే బస్తీబాట.. షాద్ నగర్ ఎమ్మెల్యే
X

దిశ, షాద్ నగర్ : ప్రజాసమస్యలను ప్రజల వద్దకు వెళ్లి క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే బస్తీ బాట కార్యక్రమమం చేపట్టామని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని 2, 16, 18వ వార్డులో పర్యటించి వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.

ప్రజలకు వార్డుల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ ఛైర్మన్ నటరాజన్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story