- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాలు మోడీ.. సంపకు మోడీ.. కట్టెలమోపుతో నిరసన తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
దిశ, మీర్ పేట్ : పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మీర్ పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందనం చెరువు నుండి మీర్ పేట్ చౌరస్తా వరకు మహిళా నాయకులతో కలిసి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నెత్తి పైన కట్టెలమోపుతో వినూత్నంగా నిరసనను తెలిపారు. మోడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాధాలతో పాదయాత్ర హోరెత్తింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనంగా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అచ్చా దిన్ అంటూ ప్రచారం చేసుకుంటు సచ్చే దినాన్ని తీసుకొచ్చారని మంత్రి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు మహిళల కళ్ళల్లో గ్యాస్ ధరల రూపంలో మంటలు కనిపిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. మోడీ దేవుడు అంటూ ప్రచారం చేసుకునే బీజేపీ నాయకులు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ ప్రజలను తీవ్రఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళలు ఓటుతోనే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శలు మురుకుంట్ల అరవింద్ శర్మ, బెర బాలకిషన్ బడంగ్పేట్, ఆర్కే పురం, సరూర్నగర్, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ, జలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.