జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

by Aamani |
జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : రానున్న వేసవి కాలంలో జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణా రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రూ.3.5 కోట్లతో నిర్మించిన నూతన విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు.దీంతో పాటు నారాయణ పూర్ గ్రామంలో రూ. 2.43 కోట్లతో 33/11 కేవీ ఉపకేంద్రము, జిల్లా సమీకృత కార్యాలయ సముదాయములోరూ. 3.13 కోట్లతో 33/11 కేవి ఉపకేంద్రాలకు సంబంధించి శిలా ఫలాకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నారాయణ పూర్ గ్రామంలో ఈ ఉపకేంద్రము ప్రారంభం అయితే 3 ఫేస్ విద్యుత్ తో పాటు గ్రామ రైతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రారంభం అవుతున్న విద్యుత్ ఉప కేంద్రం ద్వారా కార్యాలయాలకు, చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)లింగ్యా నాయక్, ఆర్డిఓ వాసుచంద్ర, జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ లీలావతి, డిప్యూటీ ఇంజనీర్లు సంజీవ్, సూర్య, ఎడి సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed