అభివృద్ధి అంటేనే రాజేంద్రనగర్ నియోజకవర్గం : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Sumithra |   ( Updated:2022-10-17 13:58:57.0  )
అభివృద్ధి అంటేనే రాజేంద్రనగర్ నియోజకవర్గం : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, గండిపేట్ : అభివృద్ధి అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం అనేలా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం 2 కోట్ల22 లక్షలతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 6, 7, 8, 12, 21, 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మేయర్ మహేందర్ గౌడ్ తో కలిసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే రాజేంద్రనగర్ నియోజవర్గం అనేలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, వార్డు కార్పొరేటర్లు బొర్ర అనిత, సాగర్ గౌడ్, ప్రజాప్రతినిధులు రావుల కొళ్ల నాగరాజు, రాందాస్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిబాబా గౌడ్, అధికారులు పాల్గొన్నారు.




Advertisement

Next Story