- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసాభాసగా మారిన బడంగ్పేట్లో అభివృద్ది పనుల ప్రారంభోత్సవం...
దిశ, బడంగ్పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడా 05, 06, 24, 25 డివిజన్ లలో రూ.5 కోట్ల 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న పలుఅభివృద్ది పనుల ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. ముందుగా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో రాజీవ్ గృహకల్ప వద్ద రూ.15 లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు. రాజీవ్ గృహకల్ప నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున డీజే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి డివిజన్ 5, 26లలోని తెలంగాణ కాలనీ నుంచి సాగర్ కాంప్లెక్స్ పార్క్ వరకు రూ.2కోట్ల 40లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న బీటీ రోడ్డు పనులకు శంఖుస్థానపన చేయడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంట బీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక కాలనీల అధ్యక్షులతో పాటు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి వెంట పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు వెళ్ళారు.
డీజేను వెళ్లగొట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
రాజీవ్ గృహకల్ప నుంచి తిరుమల నగర్‌కు పెద్దశబ్దంతో వస్తున్న డీజేను మంత్రి సబితాఇంద్రారెడ్డి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శిలాఫలకం వద్దకు చేరుకోగానే... జై సబితమ్మ.. జై బీఆర్ఎస్ అంటూ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు పోటీగా కాంగ్రెస్ నాయకుల తెలంగాణ ఇచ్చింది సోనియా.. జై కాంగ్రెస్.. జై చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట...
అంతేగాకుండా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా వివాదమయ్యింది. ఈ ఫ్లెక్సీలు తాము ఏర్పాటు చేసినవి కావని, స్థానిక కాలనీల అధ్యక్షులు ఏకమయి వేసుకున్న ఫ్లెక్సీలు అంటు బీఆర్ఎస్ నాయులు అంటుండగా, ప్రోటో కాల్ లేకుండా కావలసుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నాయకులు మండి పడ్డారు. ఇంతలోనే స్థానిక కాలనీ కార్యదర్శి అమరేందర్ మెడలో బీఆర్ఎస్ కండువా ఉండడంతో, నువ్వు బీఆర్ఎస్ నాయకుడివా ? కాలనీ పెద్దవా అంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు మనోహర్, వంగేటి ప్రభాకర్‌రెడ్డిలు కండువా లాగడంతో వివాదం మొదలయ్యింది. బీఆర్ఎస్ పార్టీ కండువా ఎలా లాగావంటూ స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్‌రెడ్డి కాంగ్రెస్ కార్పొరేటర్‌పై దుర్భాషలాడారు. దీనికి కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం దుర్భాషలాడారు.
నువ్వెంతా ? అంటే నువ్వెంతా అని ఒకరినొకరు తోసివేసుకున్నారు. రంగంలోకి దిగిన మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సమయ స్పూర్తితో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదంతా గమనించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేస్తూ కాన్వాయ్ ఎక్కి కూర్చుంది. దానికి ముందు మేయర్ కాన్వాయ్ అడ్డుగా ఉండడం .. డ్రైవర్ లేకపోవడంతో... ఒక్క నిమిషం కాన్వాయ్‌లో కూర్చున్న మంత్రి సబితా కారు దిగి మండుటెండలో కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లింది. అనంతరం కోమటికుంట చెరువు వద్ద వైకుంఠథామం వద్ద పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసి వెళ్లిపోయింది. ఇది ఉలా ఉండగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హుందాతనంతో డీజేను అడ్డకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు విస్మయించారని, స్థానిక కాలనీల పెద్దలు మంత్రి సబిత మీద ఉన్న అభిమానంతో ప్రారంభోత్సవాలకు వచ్చారే తప్పా... బీఆర్ఎస్ పార్టీ పరమైన కార్యక్రమాలకు రాలేరని బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి స్పష్టం చేశారు.
ఈ ఏరియాతో సంబంధం లేని కాంగ్రెస్ కార్పొరేటర్లు అభివృద్దిని అడ్డుకోవడమే గాకుండా ప్రారంభోత్సవానికి వచ్చిన కాలనీ అధ్యక్షులను కించపరచడం ఎంతవరకు సమంజసమని స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ కండువా వేసుకుంటే తప్పేంటని, మంత్రిపై అభిమానంతో వచ్చిన, కాలనీ పెద్దల మెడలో కండువా లాగడం సరికాదని హితవు పలికారు. తాము మంత్రి వెంట చాలా కార్యక్రమాలలో బాలాపూర్‌లో ప్రారంభోత్సవాలలో పాల్గొన్నామని, తమ ఏరియా కాదని వెనుక నిలబడ్డ విషయాన్ని మరువద్దన్నారు. దమ్ముంటే వంగేటి ప్రభాకర్ రెడ్డి రాజీనామ చేసి మళ్ళీ గెలిచి చూపెట్టాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, స్థానిక కార్పొరేటర్లు ఏనుగు రామిరెడ్డి, ముత్యాల లలితా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.