- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొద్ది నిమిషాల్లో ఇంటికి.. ఇంతలోనే ప్రమాదం.. మహిళ మృతి
దిశ, పరిగి: మరో కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే సమయానికి మృత్యువు కబలించింది. వివరాల్లోకి వెళ్లితే.. దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన పూరి రమేష్, అతని భార్య షుష్మ లు కొంతకాలంగా పరిగిలో నివాసం ఉంటున్నారు. హైదారాబాద్ నుంచి పరిగికి బలేనో కారులో బుధవారం రాత్రి బయలుదేరారు. హైవే 163 రోడ్డుపై పూడూరు మండలం సోమన్ గుర్తి గేటు వద్దకు రాగానే నిద్ర మత్తులో రమేష్ కారు నడిపిస్తూ ఒక్కసారిగా ఎడమ వైపునకు స్టీరింగ్ తిప్పాడు.
దీంతో పక్కనే ఉన్న ఓ హోటల్ గోడను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ భార్య షుష్మకు తీవ్రగాయాలై అక్కిడికక్కడే మృతి చెందింది. రమేష్, అతని కూతురు తనవి లకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించి గాయాలైన రమేష్, తనవి లకు చికిత్స నిర్వహించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు.