గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Kalyani |
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, శంషాబాద్: గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రూ. 2.15 కోట్ల నిధులతో సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని రామంజాపూర్, నానాజీపూర్, కాచారం, సుల్తాన్ పల్లి గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్, గ్రామపంచాయతీ భవనంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు.

ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించే పల్లె ప్రగతి పేరుతో ప్రారంభించి గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, తాగునీరు అందించడం, స్మశానవాటికలు లాంటివి నిర్మించి ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నర్సమ్మ, కల్పన సింహా రెడ్డి, రాంగోపాల్, దండు ఇస్తారి, ఎంపిటీసిలు సంగీత సిద్దేశ్వర్, క్రాంతి కుమార్, పిఎసిఎస్ చైర్మన్లు బుర్కుంట సతీష్, దవనాకర్ గౌడ్, వైస్ చైర్మెన్ ప్రభు సాగర్, మాజీ సర్పంచ్ అరుణ సాగర్, నాయకులు చంద్రా రెడ్డి, నీరటీ రాజు, యాదగిరి రెడ్డి,రాజశేఖర్ గౌడ్, బిక్షపతి, మల్లేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story