మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్త కార్మికుల నిరసన?

by samatah |
మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్త కార్మికుల నిరసన?
X

దిశ, గండిపేట్: చెత్త ఆటోల సమస్యలను పరిష్కరించకపోతే పెట్రోల్ పోసుకొని ఇక్కడే చనిపోతామని చెత్త కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కమిషనర్ కనీసం కార్యాలయం వద్దకు రాకపోవడం పట్ల తీవ్రంగా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెత్త సేకరణ కార్మికులు మాట్లాడుతూ.. 20 సంవత్సరాల నుండి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ 80 ఆటోలలో చేస్తున్నాము, కానీ ఇప్పుడు కొత్తగా 20 చెత్త సేకరణ ఆటోలు తీసుకువచ్చి 86 కుటుంబాలకు పొట్ట కొడుతున్నారని చెత్త సేకరణ కార్మికులు ఆరోపిస్తున్నారు. చిత్త సేకరణ విషయంలో ఎక్కడ కూడా ఫిర్యాదులు లేవని, అయినా కొత్తగా 20 చెత్త సేకరణ ఆటోలు తీసుకువచ్చి మాకు అన్యాయం చేస్తున్నారని కమిషనర్, మేయర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను కలిసి కలిసి చిత్త సమస్యను వివరిస్తే మీకు న్యాయం చేస్తాము కమీషనర్‌తో మాట్లాడాను మీరు వెళ్ళండి కమిషనర్ను కలవండి అని చెప్పారు. కానీ కమిషనర్ మాత్రం మాకు కలవకుండా సమయం వృధా చేస్తూ కొత్తగా చెత్త సేకరణ చేసే ఆటో వారిని ప్రోత్సహిస్తున్నారు. మాకు న్యాయం చేయండి అంటూ లేకుంటే పెట్రోల్ పోసుకొని ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని, చెత్త కార్మికులు కార్పోరేషన్ అధికారులను హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story