- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం.. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
దిశ, యాచారం: 2024లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేసిన ఆయన అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడితే.. బీఅర్ఎస్ పాలన అవినీతికి చిరునామాగా మారిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గుండెమొని జయమ్మ, నాయకులు తాల్లపల్లి చిన్న , బోసుపల్లి వీరేషం, మంకాల దాసు , దర్శన్, తదితరులు పాల్గొన్నారు..