- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు..
దిశ, గండిపేట్ : రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే భాగోతం అంటూ బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పోస్టర్ కలకలం రేపుతోంది. ఇతర నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం వందల కోట్లు ఖర్చు అవుతుంటే.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం కేవలం రూ.కోటి 37 లక్షల ఖర్చు కావడానికి ఎవరి అసమర్థత కారణమంటూ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ హోల్డింగ్లు వెలిశాయి.
నియోజకవర్గంలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా పోస్టర్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే భాగోతం అంటూ గండిపేట మండలంలో విస్తృతంగా చర్చ మొదలైంది ఎక్కడ చూసినా పోస్టుల్లో కలకలం, మరోవైపు ఎమ్మెల్యే బర్తడే కావడంతో సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది. ప్రతిపక్ష బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఈ ఫ్లెక్సీలు వేయడంతో స్థానిక నేతలు రేపు ఎమ్మెల్యే బర్త్డే కావడంతో వారికి ఫ్లెక్సీల గిఫ్ట్ అని చెప్పేసి గుసగుసలాడుతున్నారు.