రైతుల త్యాగం వెలకట్టలేనిది : కలెక్టర్ ప్రతీక్ జైన్

by Aamani |
రైతుల త్యాగం వెలకట్టలేనిది : కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ,కొడంగల్ : శనివారం కొడంగల్ ప్రాంతంలో పారిశ్రామిక రంగాన్ని నెలకొల్పేందుకు భూసేకరణ చేస్తున్నారు.ఇందులో భాగంగా పోలేపల్లి కి చెందిన 38 మంది రైతులకు కలెక్టరేట్ లోని వీసీ హాల్ నందు నష్టపరిహారం చెక్కులను అందించి శాలువాలతో రైతులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.కొడంగల్ ప్రాంత అభివృద్ధికి భూ సేకరణలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మీరు ఆదర్శంగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి సంకల్పం తో తమ ప్రాంత అభివృద్ధి చేయాలని కల మీ త్యాగాల వల్ల నెరవేర బోతుందని కలెక్టర్ అన్నారు.

పరిశ్రమలు రావడం వల్ల తమ కుటుంబాల్లోని పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం సాధ్యం కాదని అందువల్ల ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారని ఆయన తెలిపారు. ముందు తరాలకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, దుద్యాల్ మండలం తహసిల్దార్ కిషన్ లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed