మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Kalyani |
మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ శంషాబాద్: మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ లోని కాంతరెడ్డి నగర్, తేజస్వికాలనీ, శివనగర్, కృష్ణానగర్, ఓల్డ్ విలేజ్, హుడా కాలనీలో రూ. కోటి 4 లక్షల నిధులతో బుధవారం అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత గౌరి శంకర్ తో కలిసి ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని విధాల అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీలో అభివృద్ధికి ఎన్ని నిధులైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు మంత్రి కేటీఆర్ సహకారంతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, సైడ్ లు అభివృద్ధి చేశామని అన్నారు. ఇంకా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మిగిలి ఉన్న పనులు అన్నింటిని అంచలంచెలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాంరెడ్డి, సురేందర్ రెడ్డి, అమరేందర్, కొమరయ్య, సుబాష్ రెడ్డి, విజయ్, చిత్తారి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story