బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి : ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

by Kalyani |   ( Updated:2023-10-16 11:40:14.0  )
బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి : ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
X

దిశ చౌదరిగూడ: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.మండల అధ్యక్షుడు సయ్యద్ హఫీజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

దీనిని గమనించి ప్రజలు ప్రతిపక్షాల ప్రలోభాలకు,మాయమాటలు విని మోసపోవద్దని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు.ప్రతిపక్షాలు ప్రజలను తికమక పెడుతున్నారని, వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతుగా నిలిచి మూడవసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి,బంగారురాములు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాబురావు,కోఆప్షన్ సభ్యులు నర్సింగ్ రావు,సర్పంచ్ గూడ.స్వామి,బోయ.రామచంద్రయ్య,కేకే కృష్ణ,పడకంటి.వెంకటేష్,బంగారు.రామచంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed