- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి : ఎమ్మెల్యే జీఎంఆర్
దిశ,పటాన్ చెరు : జలమండలి ఆధ్వర్యంలో ఓ ఆర్ ఆర్ ఫేజ్ 2 పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల ప్రగతిని ఎంఎల్ఏ కు వివరించారు. ప్రధానంగా బొల్లారం బీరంగూడ అమీన్ పూర్, తెల్లాపూర్ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.
రాబోయే 15 రోజుల్లో పంపింగ్ పనులు సైతం పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికల సిద్ధం చేసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కాలుష్య జలాలతో ఇబ్బంది పడుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. పైపులైన్ల లీకేజీ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎంలు చంద్రశేఖర్, శివకుమార్, ఏఈలు ప్రవీణ్, పూర్ణేశ్వరి, శ్రీనివాస్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.