- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుల్తాన్ పల్లిలో ఉద్రిక్తత.. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు..
దిశ, శంషాబాద్ : పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 129లో 16 ఎకరాల 24 గుంటల, 142లో 8 ఎకరాల 26 గుంటల భూమి ప్రభుత్వ భూమి, రికార్డులో 25 ఎకరాలు ఉందని దానిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై గత నెల జనవరిలో పట్టాపాస్ పుస్తకాలు సృష్టించారన్నారు. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుల్తాన్ పల్లి గ్రామానికి చెందిన 84 మంది నిరుపేదలకు సర్వేనెంబర్ 142లో ఇందిరమ్మ పథకం కింద ఇంటిస్థలాలను కేటాయించిందని అన్నారు.
సర్వేనెంబర్ 129లో 14 ఎకరాలలో బోడోనికుంట (చెరువు) ఆ కుంటలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద కుంటలో మట్టి తీయడానికి నిధులు కూడా మంజూరు చేసిందని అన్నారు. కొందరు అధికారుల అండదండలతో నిరుపేదలకు కేటాయించిన స్థలంలో నకిలీపత్రాలు సృష్టించి ఆక్రమణకు గురిచేస్తున్నారని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి పేదలకు న్యాయం చేయాలని అన్నారు. పెద్దఎత్తున వందలాదిమంది సుల్తాన్ పల్లి గ్రామ ప్రజలు బోడోనికుంట వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిలో చదును చేస్తున్న జేసీబీ పై గ్రామస్తుల రాళ్లదాడి చేశారు. గ్రామ ప్రజలకు మద్దతుగా సర్పంచ్ దండు ఇస్తారి, ఎంపీటీసీ సంగీత సితేశ్వర్ మద్దతు పలకడంతో పరిస్థితి మరింత ఉధృతకు దారి తీసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గ్రామస్తుల మధ్య తోపులాట వాగ్వాదం చేర్చుకోవడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమకు న్యాయం జరిగేదాకా ఊరుకునే ప్రసక్తే లేదని ఎంతటి కైనా సిద్ధమే అని గ్రామస్తులు భీష్మంచి కూర్చున్నారు. స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు సర్వేనెంబర్ 129లో 14 ఎకరాలు బోడోనికుంట ఉందనికుంటలో ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేసిన, ఆక్రమణలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎప్టీఎల్ ప్రాంతంలో చదును చేసిన వారిపై విచారించి వారు చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్ ఏఈ మౌనిక మాట్లాడుతూ సుల్తాన్ పల్లిలోని సర్వేనెంబర్ 129లో 14 ఎకరాలు బోడోనికుంట ఉందని పట్టి కుంటలు రియల్ ఎస్టేట్ పేపర్లు ఆక్రమించి చదును చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఘటనస్థలాన్ని పరిశీలించమన్నారు. కుంటలు చదును చేసినట్టు గుర్తించామని విచారించి వారిపై విచారించే చర్యలు తీసుకుంటామన్నారు. కుంటలో ఎలాంటి పనులు చేయకుండా నిలిపివేశామన్నారు. కుంటకు ఎఫ్ టీఎల్ ఆద్దురాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇది ప్రభుత్వ భూమి కాదు పట్టా భూమే
పీఏసీఎస్ మాజీ చైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్ సుల్తాన్ పల్లి గ్రామంలోని సర్వే 129, 142 లో ఉండే 25 ఎకరాల భూమి బిల్లా దాఖలు సంబంధించిన భూమిని దానికి పట్టాదారులైన పులిమామిడి నరసింహ, పులిమామిడి అశోక్, పులిమామిడి రవీందర్ల నుండి కాసుల చంద్రశేఖర్ గౌడ్, దూడల వెంకటేష్ గౌడ్, చారి, మేము ముగ్గురం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. 2007 సంవత్సరంలో మా పట్టా భూములో ప్రభుత్వం ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడంతో కోర్డుకు వెళ్లికోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్త పాస్ బుక్ మంజురయ్యారు. కావాలనే కొందరు మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.