- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీక్షా దివస్ లో గందరగోళం..
దిశ ప్రతినిధి వికారాబాద్ : తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ లో గందరగోళం ఏర్పడింది. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తన ప్రసంగం ప్రారంభంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంతో కొడంగల్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుతిరిగారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసుకుంటూ స్టేజ్ దగ్గరికి వచ్చి ఆనంద్ పై విరుచుకు పడ్డారు. దుద్యాల రైతుల కోసం జైలుకు వెళ్లిన మా నాయకుడిని విస్మరిస్తారా..? మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కార్యకర్తలను లెక్కచేయడం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే క్షమాపణ చెప్పాలని కోరడంతో వెనక్కి తాగిన ఆనంద్, ముందుగా స్టేజిపై ఉన్న నాయకుల పేర్లు మాత్రమే పిలవడం జరిగిందని, నరేందర్ రెడ్డి గురించి చివరలో చెబుదాం అనుకున్నానని అన్నారు. ఈ విషయంలో మీరు ఇబ్బంది పడి ఉంటే నన్ను క్షమించాలని కోరారు. దాంతో సమస్య సద్దుమణిగింది.