- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు మరిచింది...విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, మహేశ్వరం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదని, పార్లమెంట్ కు డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ పేరును పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీకి పేద ప్రజలపై ప్రేమ ఉంటే గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను మరచిందన్నారు.
బీజేపి నాయకులు హిందూ, ముస్లిం మందిర్ మసీద్ అంటూ ప్రజల్లో విభేదాలు సృష్టించేలా చేస్తున్నారన్నారు. రానున్న ఐదేళ్లలలో తుక్కుగూడ రూపురేఖలు మారిపోతాయన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో 55 కంపెనీలు వచ్చాయన్నారు. కంపెనీలతో స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుక్కుగూడ ఆయాచితం శ్రీధర్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకటరెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, రెడ్డిగల్ల సుమన్, సప్పిడి లావణ్య రాజు, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజ్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.