- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.300 కోట్లతో అనంతగిరి అభివృద్ధి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
దిశ, ప్రతినిధి వికారాబాద్ : పర్యాటకులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అనంతగిరి అర్బన్ పార్కును అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం అనంతగిరి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ క్వార్టర్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అటవీశాఖ జోనల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీష్ లతో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అనంతగిరి అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు.
దీనిలో భాగంగా 200 ఎకరాల్లో అనంతగిరి అర్బన్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంతో నిరుద్యోగ యువతతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నీటి నిల్వలు ఉండే విధంగా చెక్ డ్యాముల నిర్మాణాలు, మరమ్మత్తుల పనులు చేపట్టాలని సభాపతి అధికారులకు సూచించారు. పర్యాటక ప్రాంత అభివృద్ధితో పాటు వికారాబాద్ పరిసర ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందతాయని అని అన్నారు. మూసీ కాలుష్యానికి గురికాకుండా ఇక్కడి నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డిఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు.