దేవతల గుట్ట హనుమాన్ దేవాలయ ధర్మకర్తల మండలి భాద్యతల స్వీకరణ..

by Sumithra |
దేవతల గుట్ట హనుమాన్ దేవాలయ ధర్మకర్తల మండలి భాద్యతల స్వీకరణ..
X

దిశ, బడంగ్ పేట్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామం దేవతల గుట్ట శ్రీ స్వయంభూ హనుమాన్ దేవాలయ ధర్మకర్తల మండలి నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా మంత్రి సబితకు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధర్మకర్తలు గుత్తా అనిత, మందడి శివారెడ్డి, మాచర్ల గణేష్ కుమార్,జూకంటి సత్యసాయి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్ళెం నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed