జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి: MLA Prakash Goud

by Kalyani |   ( Updated:2023-07-18 13:56:34.0  )
జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి: MLA Prakash Goud
X

దిశ శంషాబాద్ : జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం (రేపు) శంషాబాద్ లో మంత్రి కేటీఆర్ ప్రారంభించే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కోరుతూ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడారు. జిల్లా పార్టీ కార్యాలయం మన నియోజకవర్గంలో నిర్మించడం మన అదృష్టమన్నారు. దీనివల్ల పార్టీ బలోపేతానికి పునాది వేసినట్లు అవుతుంది అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు గ్రామ గ్రామాన తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కేటీఆర్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు బుర్కుంట సతీష్, దవనాకర్ గౌడ్, నాయకులు గణేష్ గుప్త, నీరటీ రాజు, దిద్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed