ప్రతియేటా పెరుగుతున్న "శివుడి"రూపం..

by Sumithra |
ప్రతియేటా పెరుగుతున్న శివుడిరూపం..
X

దిశ, షాద్ నగర్ : రామేశ్వరం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఈనెల ఫిబ్రవరి 14 నుంచి 22వ తేది వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం మంచినీరు శాంతిభద్రతలు, సీసీ కెమెరాలు, ప్రథమ చికిత్స కేంద్రం సదుపాయాలు ఉండే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకోసం 17 తారీకు నుండీ 19 వరకు ప్రత్యేక బస్సులు షాద్ నగర్ నుండి రామేశ్వరానికి ప్రతీరోజు 20 బస్సులు నడుస్తాయని డిపోమేనేజర్ తెలిపారు.

ధర్మదర్శనం చేసుకునే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసారు. జాతర జరిగే తొమ్మిది రోజులు భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడ్డానికి ఆలయ సిబ్బంది కృషి చేస్తామని తెలిపారు. ఈ మహా శివరాత్రి సందర్భంగా సుమారు లక్ష మంది దర్శనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రామలింగేశ్వర స్వామి ఆలయం షాద్ నగర్ నుండి రాయికల్ మీదుగా రామేశ్వరం ఎనిమిది కిలోమీటర్లు దూరం ఉంటుంది. పరమశివుని సన్నిధిలో పౌర్ణమిరోజు నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే ప్రతిసోమవారం పరమశివుని దర్శనం కోసం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడాది పరమశివుని రూపం పెరగడం ఇక్కడ ఏకమైన విశిష్టత. పరమశివుని దర్శనం చేసుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల పూర్తి విశ్వాసం.

ఆలయ చరిత్ర...

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరం ఫరూఖ్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది. శ్రీ రామచంద్రుడు ప్రార్థన చేస్తే పుట్టిన స్వయంభు లింగం అంటారు. శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసిన తర్వాత సప్త ఋషులు శ్రీరామచంద్రుని ఇలా చెప్పారంట. స్వామి మీరు ఒక బ్రాహ్మణుని సంహరించారు. అందులో అత్యంత శివభక్తున్ని సంహరించారు. కాబట్టి మీరు లింగప్రతిష్టాపన చేయవలసిందిగా సప్తఋషులు శ్రీరామచంద్రునికి చెప్పారు. శ్రీరామచంద్రులవారు ప్రతిష్ట చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు.

ఆ సమయంలో ఈ ప్రాంతంలో శివలింగాకారంలో ఒక శిలా విగ్రహం కూడా కనిపించకపోవడంతో శ్రీరామచంద్రుల వారు ఆ పరమశివుని ప్రార్థించగా ఆ పరమశివుడు శ్రీరాముడికి ఈ విధంగా సెలవు ఇచ్చారు. ఇదే ప్రాంతంలో రేగిచెట్టు కింద భాగంలో ఉన్నాను అని ఆ స్వామికి చెప్పగా అక్కడే స్వామికి పూజకార్యక్రమాలు నిర్వహించి వెళ్లారు. అర్చకులు తెలియజేసిన విషయం. పార్వతమ్మ దేవాలయం రామేశ్వరంకు ఎడమ వైపున పార్వతమ్మ దేవాలయం వుంటుంది. ప్రతీ శుక్రవారం ప్రత్యేక పూజలు కూడ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed