సామాన్యుడి పై శివతాండవం చేస్తే ఎలా..?

by Sumithra |
సామాన్యుడి పై శివతాండవం చేస్తే ఎలా..?
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : దేవుడిని పూజించడం అందరు చేసేపని, మన దేవుడిని ఎవరు దూషించిన అది ముమ్మాటికీ తప్పే. ఆ విషయంలో ఎవరిని ఎవరు సమర్ధించరు వెనకేసుకురారు. మనం పూజించే దేవుడిని ఎవరైనా దూషిస్తే వారిని చట్టానికి అప్పగించి శిక్షించాలి కానీ మనమే చట్టాన్ని చేతులోకి తీసుకొని మనిషిని చంపాలి అనుకోవడం కూడా క్షమించరాని నేరం అని, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడుతుందని సమాజంపట్ల అవగాహనా ఉన్న పండితులు, వివిధ సంఘాల నాయకులు చివరికి సామాన్య ప్రజలు సైతం తప్పు బడుతున్నారు. ఆమధ్య వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో భైరినరేష్, అయ్యప్ప స్వామి పుట్టుకను అవమానించాడని అయ్యప్ప స్వాములు రోడ్డు మీదకు వస్తే, ఇప్పుడు ఇదే జిల్లాలోని యాలాల్ మండలంలో ఒక శివమాల వేసుకున్న భక్తుడిపై దాడిచేసి భూతులు తిట్టాడని దాదాపు 50 మంది శివస్వాములు రోడ్డుపై పోలీసుల ముందే రౌడీయిజం చేయడం దేనికి సంకేతమని వారు ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల ముందే చట్టాన్ని చేతుల్లోకి..

శివస్వాములు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాలాల్ మండల పరిధిలోని దేవనూర్ గత సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బోయిని శ్రీనివాస్, మెట్లీ నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. శివస్వామి మాలలో ఉన్న నరేందర్ గొడవ ఆపడానికి ప్రయత్నించాడు. కానీ నరేష్ అనేవ్యక్తి నరేందర్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకా చేయి చేసుకున్నాడని చెబుతున్నారు. దాంతో అక్కడికి వచ్చిన మరికొందరు శివస్వాములు గొడవ సర్దు మణిగించి, నరేందర్ తో యాలాల్ పోలీస్ స్టేషన్ లో నరేష్ పై కేసు నమోదు చేయించారు. అయిన చట్టం తీసుకునే చర్య సరిపోతుందో లేదో అని భావించి, లక్ష్మి నారాయణపూర్ చౌరస్తా దగ్గర ధర్నా కూడా చేసారు.

ఇక్కడివరకు బాగానే ఉన్న తప్పు చేసిన నరేష్ అనే వ్యక్తి పై పోలీసుల ముందే చట్టాన్ని చేతులోకి తీసుకొని రాళ్ళూ, కుండలు, చీపుర్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేయడాన్ని అందరు తప్పుపడుతున్నారు. మీరు శివస్వాముల..? రౌడీల..? శివమాలలో ఉన్న వ్యక్తిని అవమానించాడు అంటూ ఇలా చట్టాన్ని చేతులోకి తీసుకుని సామాన్యుడి పై శివ తాండవం చేస్తే ఎలా..? ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడంతో లా అండ్ ఆర్డర్ గతి తప్పుతుందా..? అనే చర్చ జరుగుతుంది. ఫ్రెండ్లి పోలీస్ అనడం కారణంగానే సామాన్యులు సైతం చట్టానికి భయపడడం లేదని, ఇకపై ఇలాంటి సంఘటనల పట్ల పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దాడి చేసిన వారిపై అట్రాసిటీ, అటెంటు మర్డర్ కేసులు పెట్టాలి : ఎమ్ఆర్పిఎస్ జిల్లా కో ఆర్డినేటర్ ఆనంద్

దేవుడిని, దేవుడి మాలలో ఉన్న వారిని అవమానించడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం క్షేమించారని నేరం. దానికి చట్టం, పోలీసులు, కోర్టులు ఉన్నాయి. అలాంటి చట్టాన్ని చేతులోకి తీసుకొని సామాన్యుడి పై, అందులోను ఒక దళితుడిపై ప్రాణం తీసేలా పోలీసుల ముందే దాడికి దిగడం అంతకంటే క్షమించరాని నేరం. కాబట్టి దళితుడైన నరేష్ పై దాడి చేసిన శివస్వాములు ప్రతి ఒక్కరిపై 332, 341, 307 సెక్షన్ల కిందే కాక, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి కఠినచర్యలు తీసుకోవాలి జిల్లా ఎమ్ఆర్పీఎస్ కో ఆర్డినేటర్ ఆనంద్ డిమాండ్ చేసారు.

Advertisement

Next Story