రాముడు ఎవరి అబ్బ సొత్తు కాదు! ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతుంటే మైక్ లాగేసిన రాకేశ్ రెడ్డి!

by Ramesh N |   ( Updated:2024-03-20 09:32:40.0  )
రాముడు ఎవరి అబ్బ సొత్తు కాదు! ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతుంటే మైక్ లాగేసిన రాకేశ్ రెడ్డి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన రజాకార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వర్సెస్ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. రజాకార్ సినిమా కాదని వాస్తవ చరిత్ర అన్నారు. ఈ మూవీ టీమ్ అందరి కాళ్లు కడిగి మా తలలపై పోసుకున్న మా పాపం పోదన్నారు. మిగతా వారికి రాజాకార్ అనేది కేవలం సినిమా మాత్రమే కావొచ్చు కానీ మాకు మా ఐదు తరాల పూర్వీకుల నరకయాతన అన్నారు. లక్షల మందిని చంపిన నిజాం రాజును రాజ్ ప్రముఖ్ గా నాటి ఢిల్లీ పాలకులు ప్రకటించారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులా బతకాలంటే రజాకార్ మూవీ చూడాలని ఇది గతం కాదని మనందరి భవిష్యత్ అన్నారు.

అనంతరం స్టేజి పైకి వచ్చిన ఆర్.నారాయణ మూర్తి.. ఎవరికీ తలవంచని నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించారని తెలిపారు. గతంలో గుజారాత్ లోని జూనాఘట్, తెలంగాణను భారత్‌లో కలిపి ఉండక పోతే నేడు ప్రజాస్వామం ఉండేది కాదన్నారు. భారత్ నుంచి హిందువులు వెళ్లిపోతుంటే.. వచ్చే ఐదేళ్లు కూడా బీజేపీ 400 ఎంపీ సీట్లతో పాలన చేస్తుందని ప్రధాని మోడీ అంటారా? అని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎవరిని పంపేది లేదని చట్టాలు అందరికీ సమానం అని గుర్తుచేశారు. విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమే భారత్ అని వివరించారు. మత పిచ్చోళ్లని ఖండించాలన్నారు. మత పిచ్చి వద్దని, తీవ్రవాదులుగా ఉండోదన్నారు.

శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదు

హిందూ ముస్లిం బాయి, బాయి అని అందరూ కలిసి ఉండాలన్నారు. వెంటనే ఆ సమయంలో ఆర్ నారాయణ మూర్తి వద్ద ఉన్న మైక్ రాకేష్ రెడ్డి లాగేసుకున్నారు. ఇండియాలో పూర్వం మత మార్పిడులకు గురయ్యారని తెలిపారు. సభలో జైశ్రీరామ్ అంటూ పలువురు నినాదాలు చేశారు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న ఆర్ నారాయణ మూర్తి ‘యే తమ్ముడు.. మాట్లాడితే జైశ్రీరామ్ అంటున్నావు.. శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదు ’అని ఫైర్ అయ్యారు. రాముడు బీజేపీ సంబంధించిన వ్యక్తి కాదు.. అందరికీ సంబంధించిన వ్యక్తి, నేను రాముని భక్తుడినే.. జైశ్రీరామ్, నేను హిందువునే అంటూ ఆర్ నారాయణ మూర్తి నినాదం చేశారు.

Advertisement

Next Story

Most Viewed