- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఇది కాంగ్రెస్ గెలుపు కాదు'.. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆసక్తికర కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ది అసలు గెలుపే కాదని, బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం వల్లే హస్తం నేతలు గెలిచారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కొంగరకలాన్ శ్లోక గార్డెన్ లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేసీఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల సంపద పెంచుకున్నారని, లోపాలు సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు.
తెలంగాణలో బీఆర్ఎస్ మునిపోయిన పడవ అని, కాంగ్రెస్ మునగబోయే పడవ అని అమిత్ షా భరోసా ఇచ్చారన్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, అయితే అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. స్థానిక అంశాలకు ప్రభావితమై అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేశారని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడతామని ధీమా వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయని లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు.