తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. కీలక పథకం ప్రారంభించిన సర్కార్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-17 11:16:03.0  )
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. కీలక పథకం ప్రారంభించిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభం అయింది. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ. 4 లక్షల రుణాలు ఇవ్వనున్నది. సంక్షేమ శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహాకారంతో ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. కాగా, ఏప్రిల్ ఐదో తేదీ లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

రూ. 6వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి తగ్గకుండా సాయం చేయనున్నట్టు ఇప్పటికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఇటీవలే రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు.

Next Story

Most Viewed