తెలంగాణ హోం మంత్రి ఓ రబ్బర్ స్టాంప్: MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-01 08:24:31.0  )
తెలంగాణ హోం మంత్రి ఓ రబ్బర్ స్టాంప్: MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హోం మంత్రి రబ్బర్ స్టాంప్‌గా మారారని మండిపడ్డారు. యూపీ హోం మంత్రి ఎలా పని చేస్తున్నారో మహమూద్ అలీ చూసి నేర్చుకోవాలన్నారు. హోం మంత్రి లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోతే ఆ బాధ్యతలు మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే గోషామహల్ నియోజకవర్గం ఓటర్ జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని రాజాసింగ్ ఆరోపించారు.

నియోజకవర్గంలో 45 వేల మంది వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని.. అదే సమయంలో ఇతర నియోజకవర్గాలకు చెందిన వారిని పెద్ద ఎత్తున గోషామహల్‌లో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని.. అలాగే సెప్టెంబర్ 2, 3 తేదీల్లో నియోజకవర్గ ఓటర్లు పోలింగ్ బూత్‌లను సందర్శించి ఓటర్ జాబితాలో మీ ఓటర్ కార్డును చెక్ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story