రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Nagaya |   ( Updated:2022-11-30 15:18:54.0  )
రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాసిస్టు పాలనను అంతమొందించి బంగారు తెలంగాణను తీసుకురావాలంటే బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ.. కేసీఆర్‌తో పోరాడే సామర్థ్యం రేవంత్‌కి లేదని విమర్శలు గుప్పించారు. అందుకే రేవంత్ చేతిలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మునుగోడులో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. తన బాస్ ఆదేశిస్తే ఏదో ఒక రోజు తెలంగాణ కాంగ్రెస్‌ను కూల్చేస్తాడని రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక, రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌పై రేవంత్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

READ MORE

వచ్చే ఎన్నికల్లో BJP అధికారంలోకి రావడం ఖాయం: మాజీ మంత్రి బాబూమోహన్

Advertisement

Next Story