Raja singh: టౌన్‌ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగారు: ఎమ్మెల్యే రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-07-28 10:44:13.0  )
Raja singh: టౌన్‌ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగారు: ఎమ్మెల్యే రాజాసింగ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువై జీహెచ్ఎంసీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సామాన్యులకు ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టనిదే అధికారులు పనులు చేయడం లేదని మండిపడ్డారు. పూర్తిగా లంచాలకు మరిగి ప్రజా పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఫైర్ అయ్యారు. ఇక హైదరాబాద్ నగర పరిధిలో కుప్పలుతెప్పలుగా అక్రమ కోచింగ్ సెంటర్లు వెలిశాయని అన్నారు. అందులో అనుమతి పొందినవి ఎన్నో.. అనుమతులు లేనివి ఎన్నో లెక్కే లేదని ధ్వజమెత్తారు.

ఈ విషయంలో గతంలో తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల నుంచి జీహెచ్ఎంసీ అధికారులు లంచాలను తీసుకుని వారిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా అక్రమ కోచింగ్ సెంటర్ల విషయంలో కొత్త కమిషనర్‌ దృష్టి పెట్టాలని అన్నారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు పాదర్శకంగా సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఇక ఢిల్లీ వరదల్లో మృతి చెందిన నగర యువతి తన్యా సోనీ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed