Raja Singh: కులగణన లక్ష్యం ఏమిటో సర్కార్‌కు తెలియదు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-07 06:21:41.0  )
Raja Singh: కులగణన లక్ష్యం ఏమిటో సర్కార్‌కు తెలియదు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census) లక్ష్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం (State Government) కూడా చెప్పలేకపోతోందని, తమకు కూడా తెలియదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో సకల జనుల సర్వే (Sakalajanula Survey) పేరుతో హడావుడి చేశారని, ఇప్పటి వరకు ఆ వివరాలు పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కులగణన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఖచ్చితంగా ఢిల్లీకే పంపుతుందని ఆయన కామెంట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుండా సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో రాష్ట్ర అభివృద్ది శూన్యమని రాజాసింగ్ అన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైంది. మూడు రోజుల పాటు తొలుత కుటుంబాలను గుర్తించనున్నారు. సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ నెల 9న వివరాలు నమోదు చేస్తామని, సమగ్ర కుటుంబ సర్వేలో ఏ వివరాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. దాదాపు 87,092 వేల మంది సిబ్బంది సమగ్ర ఇంటింటి సర్వేలో భాగస్వాములు అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed