బీజేపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. మాధవీలతకు మద్దతుగా రంగంలోకి రాజాసింగ్

by GSrikanth |
బీజేపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. మాధవీలతకు మద్దతుగా రంగంలోకి రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఓటింగ్ సాధించారు. దీంతో ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్‌కు పోటీగా మాధవీలతను బరిలోకి దింపింది. అయితే, మొదట మాధవీలత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తూ రంగంలోకి దిగారు. వివాదాస్పదంగా మారిన మాధవీలత రామబాణం వ్యవహారంపై స్పందించారు. హనుమాన్ శోభాయాత్రలో రాజాసింగ్ మాట్లాడుతూ.. మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు.

పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఎంపీ అసదుద్దీన్ చెప్పినట్లు పోలీసులు తలలు ఆడిస్తున్నారని అన్నారు. ఎంపీ అసదుద్దీన్ బీఫ్ జిందాబాద్ అంటే.. తాను పోర్క్ జిందాబాద్ అంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసదుద్దీన్ చెప్పిన విధంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో 17కు, 16 స్థానాలను బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైనా ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు.

Advertisement

Next Story