- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raja Singh: సీఎం గారూ.. ఆ శాఖపై దృష్టి పెట్టండి!.. బీజేపీ ఎమ్మెల్యే కీలక రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరగవచ్చని, ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన రావూస్ ఐఏస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై స్పందించిన ఆయన తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, ఓల్డ్ రాజింద్రనగర్ లోని రావూస్ ఐఏస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వాటర్ పోయి ముగ్గురు మృతి చెందారని, అందులో ఒకరు హైదరాబాద్ కు చెందిన తానియా సోనీ ఉన్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని, తానియా ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని, అలాగే తన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. అంతేగాక తానియా కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్న చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్ధించారు.
అదే విధంగా తెలంగాణలో కూడా అక్రమంగా కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారని, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల్లో డబ్బులు తిని వాటిని చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ అంటే కరెప్షన్ మున్సిపల్ కార్పోరేషన్ లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి తన నియోజకవర్గంలోనే చాలా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఆయన టీం గానీ తన వెంట వస్తే అక్రమంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ లు ఏ విధంగా కడుతున్నారో చూపిస్తానని అన్నారు. తన నియోజకవర్గంలోనే అక్రమంగా కట్టిన కాంప్లెక్స్ లను కోట్లలో అమ్ముతున్నారని, వీటి గురించి గతంలో చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఇప్పుడు కొత్త కమీషనర్ ఆమ్రపాళి గారు వచ్చారని, వారు ఒక్కసారి టౌన్ ప్లానింగ్ అధికారులపై దృష్టి పెడితే ఎంత కరప్షన్ జరుగుతుందో తెలుస్తుందని సలహా ఇచ్చారు. ఇలాగే ఉంటే ఢిల్లీలో జరిగినట్టే ఇక్కడ కూడా ప్రమాదం జరగవచ్చని అన్నారు. తన నియోజకవర్గంలో అక్రమ గోదాంలు చాలా ఉన్నాయని, ఇక్కడ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రమాదం జరిగాక ఓ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా అని మండిపడ్డారు. హైదరాబాద్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు రౌడీయిజం చేసి డబ్బులు తీసుకుంటున్నారని, అలాంటి ఆఫీసర్లు ఉంటే మొత్తం మున్సిపాలిటీ పాడవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి గారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై ఓ సారి ఎంక్వైరీ వేసి, సరి చేయాలని రాజాసింగ్ అభ్యర్ధించారు.