రాజ్ భవన్ VS ప్రగతిభవన్.. ఆర్ఎస్పీ రియాక్షన్ ఇదే!

by Sathputhe Rajesh |
రాజ్ భవన్ VS ప్రగతిభవన్.. ఆర్ఎస్పీ రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేధాలు భగ్గుమంటున్నాయి. గవర్నర్ వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం తమిళిసై సౌందర రాజన్ చేసిన ట్వీట్ పొలిటికల్‌గా దుమారం రేపుతోంది. దీంతో మరోసారి ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య పంచాయతీ ముదిరింది.

ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన ట్వీట్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య నెలకొన్న విభేదాల్లో తెలంగాణ ప్రజల నలిగిపోతున్నారని ధ్వజమెత్తారు. తనకు తెలిసినంత వరకు ఈ రెండు భవన్‌ల మధ్య ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

10 వేల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయట కదా అని ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్.. రాజ్ భవన్ భవన్ ఆహ్వానిస్తుంటే ప్రగతి భవన్ అవమానించేలా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిట్ మోడ్‌లో ఉందని ప్రభుత్వ పాలసీలకు పక్షవాతం వచ్చిందని విమర్శించారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై స్పందిస్తూ దళితుల భవిష్యత్ కోర్టుల చేతుల్లో లేదని అన్నారు. రాజకీయ అధికారంతోనే ఇది సాధ్యం అవుతుందన్నారు. ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవార్ కాన్షీరామ్ చాలా కాలం క్రితమే నిరూపించారని అన్నారు.

Advertisement

Next Story