- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్‌తో వార్.. కేసీఆర్‌కు మిత్రుల మద్దతు!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య పొడచూపిన వైరం రాజకీయంగా భగ్గుమంటోంది. కేసీఆర్ ప్రభుత్వంపై తమిళిసై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి రాజ్ భవన్‌లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా హిమాయత్ నగర్ మఖ్దూం భవన్‌లో 74వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూనంనేని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచితే ఆ పాపంలో సీపీఐకి భాగస్వామ్యం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే తనపై రెండు కేసులు నమోదైన విషయం రేవంత్ రెడ్డి గ్రహించాలని అన్నారు. తమ పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఇవాళ దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం చేపడుతున్నట్టు కూనంనేని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇవి కూడా చదవండి: గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: Minister Talasani Srinivas Yadav