Railway News: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నెల రోజుల పాటు ఆ 12 ట్రైన్లు రద్దు!

by Shiva |
Railway News: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నెల రోజుల పాటు ఆ 12 ట్రైన్లు రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) కీలక సూచన చేసింది. మెయిన్‌టెనెన్స్ కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 ట్రైన్లను రద్దు చేస్తున్నట్లుగా గురువారం ప్రకటించింది. రద్దైన రైళ్లలో సికింద్రాబాద్‌-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, కాచిగూడ-నిజమాబాద్‌, నిజామాబాద్‌-కాచిగూడ, మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌ ట్రైన్లు ఉన్నాయి. వాటిని అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు (Railway Officials) వెల్లడించారు.

అదేవిధంగా కాచిగూడ-మల్కాజిగిరి, కాచిగూడ-మెదక్‌ మధ్య అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు వారు తెలిపారు. రాబోయే వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 16 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా కాచిగూడ- సికింద్రాబాద్‌కు ఏడు రైళ్లు, తిరుపతి-కాచిగూడ ఏడు ట్రైన్లు, సికింద్రాబాద్‌-తిరుపతి 14 సర్వీసులు, తిరుపతి- సికింద్రాబాద్‌ 14 సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు సౌత్ సెంట్రల్ జోన్‌ సీపీఆర్వో శ్రీధర్‌ వెల్లడించారు.

Advertisement

Next Story