Cast Censusపై రేపు చర్చ.. తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, ఖర్గే

by karthikeya |
Cast Censusపై రేపు చర్చ.. తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikharjun Kharge) రేపు (మంగళవారం) తెలంగాణకు రానున్నారు. ఆయనతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఇద్దరు సీనియర్ నేతలు.. అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం నిర్వహించే పీసీసీ సమావేశం (PCC Meeting)లో పాల్గొంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.

ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా కులగణనపైనే కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు ఫోకస్ చేయనున్నారట. కాస్ట్‌సెన్సెస్‌ (Cast Census)ని ఎలా అమలు చేయాలనే దానిపై మేధావులు, సీనియర్లతో రాహుల్, ఖర్గేలు చర్చిస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వే (Family Survey) అనంతరం ఈ కులగణన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సర్వేతో రాష్ట్రంలో ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారు..? ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి..? ఏ కులాలకు ప్రభుత్వ సహాయం ఎక్కువగా అవసరం..? అనే విషయాలను తెలుసుకుని ఆ డేటా ఆధారంగా సంపదను పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.

Advertisement

Next Story

Most Viewed