తప్పు చేస్తే తలవంచాల్సిందే.. కవిత వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-08 12:38:05.0  )
తప్పు చేస్తే తలవంచాల్సిందే.. కవిత వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తనకు అందిన నోటీసులపై కవిత స్పందిస్తూ తెలంగాణ ఎన్నటికీ తలవంచదు అని చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన వారెవరైనా చట్టం మందు తలవంచాల్సిందే అన్నారు. కవిత వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన రఘనందన్ రావు కుంభకోణంలో మీకు నోటీసులు అందితే ఆ బాధ్యత మొత్తం తెలంగాణ స్వీకరించాలా అని నిలదీశారు. ఈడీ నోటీసులకు తెలంగాణ సెంటిమెంట్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

Read more:

Delhi Liquor Scam : బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీకి బయలుదేరిన కవిత


Next Story