- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rachakonda CP: మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు.. రాచకొండ సీపీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టు (Journalist)పై నటుడు మోహన్ బాబు (Mohan Babu) దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోహన బాబు (Mohan Babu) అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని అన్నారు. ఆయన దగ్గర నుంచి మెడికల్ రిపోర్టు (Medical Reports) రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు కూడా జారీ చేశామని వెల్లడించారు. కానీ, ఆయన ఈనెల 24 వరకు సమయం అడిగారని.. ఆ లోపే కేసు విచారణకు కోర్టును అభ్యర్థిస్తామని అన్నారు. మంచు మనోజ్ (Manchu Manoj), మోహన్ బాబుపై మొత్తం 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. రాచకొండ పరిధిలో మోహన్‌బాబుకు గన్ లైసెన్స్ (Gun License) లేదని.. ఆయన వద్ద ఒక డబుల్ బ్యారెల్ (Double Barrel), స్పానిష్ మేడ్ రివాల్వర్ (Spanish Revolver) ఉందని అన్నారు. మరోసారి మోహన్ బాబుకు నోటీసులు ఇస్తామని.. స్పందించని పక్షంలో అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పష్టం చేశారు.