క్యాంపస్‌లో నాణ్యమైన ఆహారం అందించాలి.. జేఎన్‌టీయూహెచ్‌ విద్యార్థుల ఆందోళన

by Shiva |
క్యాంపస్‌లో నాణ్యమైన ఆహారం అందించాలి.. జేఎన్‌టీయూహెచ్‌ విద్యార్థుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్ : కళాశాలలో తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తాము తినే ఆహారంలో తరచుగా పురుగులు వస్తున్నాయని ఆ ఆహారాన్ని తినాలంటేనే అసహ్యం కలుగుతోందని ఆరోపించారు. ఎప్పటి నుంచో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తాము అధికారులు, కళాశాల అధ్యాపకులకు విజ్ఞప్తి చేసినా తమను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story