తుమ్మల పార్టీ మార్పుపై పువ్వాడ ఘాటు రియాక్షన్

by Javid Pasha |
తుమ్మల పార్టీ మార్పుపై పువ్వాడ ఘాటు రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు దాదాపు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ నేతలతో వరుసగా భేటీలు అవుతుండగా.. ఆయనను కాంగ్రెస్ నేతలందరూ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దీంతో దాదాపు బీఆర్ఎస్‌కు తమ్మల దూరమైనట్లే చెప్పుకోవచ్చు.

తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతుండటంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీకి జరిగే నష్టమేమీ లేదని పరోక్షంగా తుమ్మలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ బలం కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో ముందుకు వెళతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడంపై దృష్టి పెడతామని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. పొంగులేటి, తుమ్మల శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

గత ఎన్నికల్లో ఖమ్మంలో ఒకే సీటు గెలిచామని, కానీ ఈ సారి పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. అభివృద్ది మంత్రంతో తాము ప్రజల్లోకి వెళతామని, ఖమ్మంలో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. ఎవరూ పార్టీ మారినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదంటూ ఆదివారం జరిగిన ఒక సమావేశంలో తుమ్మలను పువ్వాడ టార్గెట్ చేశారు. ఇవాళ మరోసారి ఆయనను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed