అసెంబ్లీలో పువ్వాడ, సీతక్క మాటామంతి.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ..!

by Satheesh |
అసెంబ్లీలో పువ్వాడ, సీతక్క మాటామంతి.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో పట్టణ ప్రగతి- పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగుతున్న సమయంలోనే ఆసక్తికర సన్నివేశం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దగ్గరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లారు. 5 నిమిషాలకు పైగా మాట్లాడారు. అయితే జిల్లాలో వరదలకు నష్టపరిహారంపై మాట్లాడారా? నియోజకవర్గ సమస్యలా? లేకుంటే జిల్లా సమస్యలా? ములుగు బస్టాండ్‌లో వసతులపైనా అనేది సస్పెన్స్. అయితే ఎన్నికలకు దగ్గరపడుతున్న సమయంలో, పార్టీలో పట్టణ ప్రగతిపై సీరియస్‌గా చర్చ జరుగుతున్న తరుణంలో ఇద్దరు ఏం మాట్లాడారనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న నేపథ్యంలో పువ్వాడ వెళ్లి మాట్లాడటం చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed